1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 జూన్ 2024 (15:39 IST)

శాల్తీలు గల్లంతవుతాయి పావలా జిలేబీలు: శ్రీరెడ్డి కామెంట్స్

srireddy
శ్రీరెడ్డి. జూన్ 4 తర్వాత కూటమి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతుందనీ, ఆ తర్వాత కూటమి నాయకులు పక్క రాష్ట్రాలకు పారిపోతుంటే... ఆ సన్నివేశాలు చూడాల్సిందే అంటూ పళ్లు టపటపలాడించింది. ఐతే ఆమె చెప్పిన జోస్యం తలకిందులైంది. ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలైంది.
 
ఈ నేపధ్యంలో మరోసారి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా కూటమి పార్టీలపై విరుచుకుపడింది. గల్లీ ఫైట్స్ కాదు, ఏకంగా శాల్తీలు గల్లంతు చేసే బ్యాగ్రౌండ్ వైసిపిలోని కొందరు నాయకులకు వున్నదంటూ పెద్దిరెడ్డి, పిన్నెల్లి, కొడాలి నాని ఫోటోలను ట్యాగ్ చేసింది. శ్రీరెడ్డి పోస్ట్ పైన అటు కూటమి కార్యకర్తలు, ఇటు వైసిపి కార్యకర్తలు రకరకాలుగా స్పందిస్తున్నారు.