శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 27 అక్టోబరు 2021 (11:00 IST)

2018లో నేను పోరాట య‌త్ర చేసిన‌పుడే గంజాయిపై ఫిర్యాదులొచ్చాయ్!

ఒక ప‌క్క తెలుగుదేశం నేత‌లు గంజాయి స‌మ‌స్య‌ను హైలైట్ చేస్తూ, వైసీపీ ప్ర‌భుత్వంపైకి వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ ఎదురుదాడి చేస్తుండ‌గా, ఇపుడు దానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోడ‌య్యారు. గంజాయి పై మీడియా స‌మావేశం పెట్టి, అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి పై తీవ్ర నిర్భంధం జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో ఏపీలో రాజకీయ దుమారం చెల‌రేగింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు వైసీపీ నేత‌లు పోటీ పోటీ దీక్ష‌లు చేశారు. ఇపుడు అదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశారు.
 
 
 ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని, ఈ ప్రభావం దేశమంతటా పడుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను 2018లో ఆయన చేసిన పోరాట యాత్రలో చాలా ఫిర్యాదులు చ్చాయని వెల్లడించారు. ఏవోబీలో గంజాయి మాఫియాపైనా ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌పైనా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్‌కల్యాణ్‌ తన ట్విటర్‌లో ఖాతాలో పొందుపరుస్తూ ట్వీట్‌ చేశారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి రెండున్న ఏళ్ళు కాలేదు. అంత‌కు ముందు ఉన్న‌ది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్న విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు లేదు. 2018లోనే గంజాయి స‌మ‌స్య ఉంద‌ని చెప్ప‌డం ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉంది.