ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (18:11 IST)

పవన్ పార్టీ ఎదగలేదు.. సీఎం పోస్ట్ ఇస్తే జగన్ పార్టీ బీజేపీలో విలీనమే: జేసీ

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని అందుకే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం పవర్ స్టార్ ప

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని అందుకే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారని ఇటీవల వ్యాఖ్యానించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇంకా ఎదగలేదని జేసీ అన్నారు. ఆ పార్టీ పరిధి పరిమితంగానే ఉందని.. ఆ పరిధి దాటి బయటకు రాకపోతే.. పవన్ పార్టీకి భవిష్యత్తు ఉండదని జేసీ తెలిపారు. ఇక పవన్ పార్టీని నమ్ముకోకూడదని, ముద్రగడ పద్మనాభాన్ని పవన్ నమ్ముకున్నారని జేసీ వ్యాఖ్యానించారు. 
 
పనిలో పనిగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై కూడా జేసీ వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ బీజేపీలో విలీనం కానుందని వస్తున్న వార్తలపై జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ.. సీఎం పదవి ఇస్తానని బీజేపీ హామీ ఇస్తే.. వైకాపాను బీజేపీలో విలీనం చేసేందుకు జగన్ సిద్ధపడతారన్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదని.. కానీ బీజేపీ జగన్‌కు సీఎం పోస్టు ఇస్తానని హామీ ఇవ్వాలంటే.. ఏపీ సీఎం చంద్రబాబును వదులుకునేందుకు బీజేపీ రెడీ కావాలన్నారు. చంద్రబాబును బీజేపీ వదులుకుంటుందనే నమ్మకం లేదని జేసీ అన్నారు. ఇక సీఎం తనయుడు నారా లోకేష్ మంత్రి వర్గంలోకి వస్తే తప్పేమిటని జేసీ ప్రశ్నించారు.