బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 4 జనవరి 2025 (14:12 IST)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

crime
గుంటూరు జిల్లా పెదకాకానిలోని నంబూరుకి చెందిన షేక్ మల్లిక పది సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన అక్బర్‌ను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇదిలావుండగానే ఆమె తమ గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. విషయం తెలియడంతో భర్త ఆమెను నిలదీశాడు. దాంతో ప్రేమ్ కుమార్‌ను తీసుకుని గుంటూరు నగరంలో కాపురం పెట్టింది.

అతడిని వివాహం కూడా చేసుకున్నది. ఈ క్రమంలో ఆమె దృష్టిని పత్తిపాడుకు చెందిన నగల వ్యాపారి షేక్ అబ్దుల్ రెహమాన్ ఆకర్షించాడు. అతడితో పరిచయం పెంచుకున్నది. ఒకవైపు ప్రేమ్ కుమార్‌తో వుంటూనే రెహమాన్‌తో అక్రమ సంబంధం సాగించింది. కొంతకాలం తర్వాత నగల వ్యాపారికి కూడా హ్యాండ్ ఇచ్చి తన భర్త ప్రేమ్ కుమార్‌తో కలిసి నంబూరుకి మకాం మార్చేసింది.
 
ఐతే కొత్త సంవత్సరానికి ముందు డిశెంబరు 28న తన ఇంట్లో శవమై తేలింది. పోలీసులకు సమాచారం అందటంతో ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చారో సిసి కెమేరాను పరిశీలించగా మల్లిక ఇంటికి ముగ్గురు వ్యక్తులు యాక్టివాపై వచ్చినట్లు కనిపించారు. ఆ ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఐతే ఈ ముగ్గురు మల్లికను హత్య చేయాల్సిన అవసరం ఏంటని వారి వద్ద విచారణ జరుపగా షాకింగ్ విషయం తెలిసింది. నగల వ్యాపారి అయిన రెహమాన్ తను మల్లిక లేనిదే వుండలేననీ, ఆమెను ఎలాగైనా వశీకరణ ద్వారా తనకు దగ్గరయ్యేట్లు చేయమని పురమాయించాడు.
 
ఈ క్రమంలో అతడు షేక్ జనాబ్ అహ్మద్‌ను సంప్రదించి మల్లికను వశీకరణ చేయాల్సిందిగా చెప్పాడు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో మల్లికను మట్టుబెట్టమని చెప్పేసాడు. దీనితో యాక్టివాపై వచ్చిన స్వప్న, రసూల్, అహ్మద్ ముగ్గురూ కలిసి మల్లిక గొంతుకి చున్నీ బిగించి చంపేసారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.