శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (09:14 IST)

నేడు ఎన్టీఆర్ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు

ntr anniversary
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్.టి.రామారావు 27వ వర్థంతి వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బుధవారం తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తమ తాత సమాధిఫై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
అలాగే, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు, మంచిని స్మరించుకుంటున్నారు.