క్యెంట్ తుఫాను బలహీనం... బంగాళఖాతంలో వాయుగుండం
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన క్యెంట్ తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో మచిలీపట్నానికి 410 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 530 కి.మీ
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన క్యెంట్ తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో మచిలీపట్నానికి 410 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 530 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకృతమైంది.
మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయు గుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం తుపాను గండం తప్పినట్లే అని, అయితే వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు.