ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:04 IST)

మీరసలు మనుషులేనా?.. జగన్ పై నిప్పులు చెరిగిన లోకేష్

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల మృతిని కూడా రాజకీయానికి వాడుకుంటూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ పై టిడిపి జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు.

ట్విట్టర్ లో "జగన్  గారూ! శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా? కోడెలగారిని కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా? 
 
కోడెలగారిది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా?" అని మండిపడ్డారు.