గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 11 జూన్ 2021 (18:52 IST)

గూగుల్‌లో పప్పు కొడితే లోకేష్ పేరు వచ్చింది: మంత్రి అనిల్ కుమార్

గూగుల్‌లో ఎపి పప్పు అని కొడితే నారా లోకేష్ పేరు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోచేసి హెరిటేజ్ కంపెనీని చంద్రబాబునాయుడు నడుపుతున్నారని ఆరోపించారు.
 
జగన్‌ను విమర్సించే అర్హత నారా లోకేష్‌కు లేదన్నారు. ఎపిలో టిడిపి పనైపోయిందని.. రైతులకు మంచి చేస్తుంటే టిడిపి చూస్తూ ఉండలేకపోతోందన్నారు. ప్రతి విషయాన్ని టిడిపి రాజకీయం చేస్తోందన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేష్‌కు లేదన్నారు. 
 
మరోసారి ఎపి సిఎంపై లోకేష్ విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోకేష్‌ను హెచ్చరించారు. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని నీ కొడుక్కి సైకిల్ నేర్పిస్తున్నావు.. ఆ పని సక్రమంగా చేసుకో.. అంతే తప్ప నోటికొచ్చినట్లు మమ్మల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.