సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (08:06 IST)

తెదేపా మాజీ ఎంపీ కుమారుడు కన్నుమూత

ఇటీవల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ మాగుంట బాబు కుమారుడు.. మాగంటి రాంజీ కన్నుమూశారు. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గత అర్థ రాత్రి తుదిశ్వాస విడిచారు. 
 
అయితే, తొలుత తెలుగు యువత పదవి రాలేదన్న బాధతో పాటు.. కొన్ని రకాలైన వేధింపు కేసులు ఆయనపై ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాబు పెద్ద కుమారుడైన మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నది ఒక కథనంగా ఉంది.
 
అయితే, తాజాగా సమాచారం మేరకు, రాంజీ బ్రెయిన్ డెడ్‌ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్న ఆయనకు మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాంజీ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
 
టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాంజీ, పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ మృతి విషయం తెలిసి టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ నటుడు నారా రోహిత్, మాజీ మంత్రి నారా లోకేశ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.