బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (14:47 IST)

ఆర్టీసీ బస్సు జనంపైకి ఎలా దూసుకొస్తుందో చూడండి? (Video)

విజయవాడలో దారుణం జరిగింది. స్థానిక అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలోని బుడమేరు వంతెన వద్ద గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది.

విజయవాడలో దారుణం జరిగింది. స్థానిక అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలోని బుడమేరు వంతెన వద్ద గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు గన్నవరం వాంబేకాలనీ మీదుగా బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో జనంపైకి దూసుకెళ్లింది.
 
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఓ ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులను మహిళ కురిషేద్ ‌(40), హుర్షా (12)గా గుర్తించారు. 
 
ప్రమాదం అనంతరం కోపోద్రిక్తులైన మృతుల కుటుంబసభ్యులు బస్సును తగులబెట్టగా పోలీసు సిబ్బంది మంటలను అదుపుచేసి వారిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ఏలూరు రోడ్డులోని కొత్తాసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌.. ప్రమాదాన్ని గమనించి లారీని అడ్డు పెట్టడంతో బస్సు నిలిచిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.