గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By chj
Last Modified: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (16:24 IST)

క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు దాండియా నృత్య నీరాజ‌నం... 300 మంది గుజ‌రాతీ మ‌హిళ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌య‌వాడ‌: న‌వ‌రాత్రి వేడుక‌ల నేప‌ధ్యంలో క‌న‌క‌దుర్గ‌మ్మకు నృత్య‌ నీరాజ‌నం అందించనున్న‌ట్లు క్రియేటివ్ సోల్ వ్య‌వ‌స్థాప‌కురాలు సుమ‌న్ తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల‌లో న‌గ‌రంలోని ఇందిరాగాంధీ పుర‌పాల‌క క్రీడామైదానం పుట్‌బాల్ గ్రౌండ్‌లో వేడుక‌ను నిర

విజ‌య‌వాడ‌: న‌వ‌రాత్రి వేడుక‌ల నేప‌ధ్యంలో క‌న‌క‌దుర్గ‌మ్మకు నృత్య‌ నీరాజ‌నం అందించనున్న‌ట్లు క్రియేటివ్ సోల్ వ్య‌వ‌స్థాప‌కురాలు సుమ‌న్ తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల‌లో న‌గ‌రంలోని ఇందిరాగాంధీ పుర‌పాల‌క క్రీడామైదానం పుట్‌బాల్ గ్రౌండ్‌లో వేడుక‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, బెజ‌వాడ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ఈ వినూత్న కార్య‌క్ర‌మానికి నాంది ప‌ల‌క‌గా, దాదాపు మూడువంద‌ల మంది గుజ‌రాతీ మ‌హిళ‌లు దాండియా, గ‌ర్బా నృత్య‌రీతుల‌తో అమ్మ‌వారిని కొలుస్తార‌ని వివ‌రించారు. 
 
గ‌త ఇర‌వై రోజులుగా దాండియా శిక్ష‌ణ‌ను నిర్వ‌హించిన జ్యోతి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో సోమ‌వారం మీడియాతో మాట్లాడిన క్రియేటివ్ సోల్ ప్ర‌తినిధులు తొలిసారి గుజ‌రాతీ ప‌డ‌తులు నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి న‌గ‌ర వాసులు స‌హ‌క‌రిస్తార‌ని భావిస్తున్నామ‌న్నారు. విజ‌య‌వాడ యువ‌తుల కోసం ప్ర‌త్యేకంగా 20 రోజుల పాటు దాండియా శిక్ష‌ణా కార్య‌క్ర‌మం నిర్వ‌హించామ‌న్నారు. మూడు రోజుల పాటు సాగే వేడుక‌లు సాయంత్రం ఏడు గంట‌ల నుండి రాత్రి 11.30 వ‌ర‌కు సాగుతాయ‌ని, దాండియా, గ‌ర్బా నృత్యాల‌తో పాటు గుజ‌రాతీ సంగీత క‌ళాకారులు పాట‌ల‌ను ఆల‌పిస్తార‌ని, వాద్య క‌ళాకారులు వీనుల విందైన సంగీతం అందిస్తార‌ని సుమ‌న్  పేర్కొన్నారు. 
 
క్రియేటివ్ సోల్ స‌హవ్య‌వ‌స్థాప‌కురాలు నీహా మాట్లాడుతూ ప్ర‌ద‌ర్శ‌న తిల‌కించాల‌నుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా ఎంట్రీ పాస్ పొంద‌వ‌ల‌సి ఉంటుంద‌న్నారు. మూడు రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఒకేసారి ఎంట్రీపాస్ తీసుకోవ‌చ్చ‌ని, విడివిడిగా అయా రోజుల‌కు కూడా పాస్‌లు పొంద‌వ‌చ్చ‌న్నారు. న‌గ‌రంలోని ఎంబిఎస్ జ్యూయ‌ల‌ర్స్‌- ఎంజి రోడ్డ్‌, రాజ్ పుతానా జ్యూయ‌ల‌ర్స్‌- వ‌న్‌టౌన్‌, ఘ‌ర్ స‌న్‌సార్ - బీసెంట్ రోడ్, న‌కోడా మొబైల్ సెంట‌ర్ - వ‌న్ టౌన్‌ల‌లో ఎంట్రీపాస్‌లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు.
 
ప్ర‌ద‌ర్శ‌నకారుల‌లో పోటీత‌త్వాన్ని పెంపొందిస్తూ వారి ఉత్సాహ‌భ‌రిత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో నిపుణ‌త ప్ర‌ద‌ర్శించిన క‌ళాకారుల‌కు రూ.ల‌క్ష‌కు పైబ‌డిన బ‌హుమ‌తుల‌ను అందిస్తున్నామ‌న్నారు. దుర్గాదేవికి మ‌హిషాసురునికి మ‌ధ్య జ‌రిగే యుద్ధానికి ప్ర‌తీక‌గా ఉత్త‌ర భార‌తదేశంలో దాండియా ఆడ‌తార‌ని, అమ్మ‌వారికి హార‌తి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద క‌లిసి ఈ నృత్యం చేస్తార‌ని వివ‌రించారు. జీవితంలో ఈ క్ష‌ణాన్ని పండుగ‌లా పండించుకోవ‌ట‌మే అన్న నినాదంలో మూడు రోజుల ప్ర‌ధాన‌ వేడుక‌లు జ‌రుగుతాయ‌న్నారు. 
 
న‌గ‌రంలో దాండియా శిక్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా నిష్ణాతులైన శిక్ష‌కులు విజ‌య్ ఛాలా, తృణాల్ ప‌ర్మాల్ (అహ్మ‌దాబాద్‌) వ‌చ్చార‌ని వారి ద్వారా మంచి నృత్య‌బోధ‌న‌ను అందించ‌గ‌లిగార‌న్నారు. క‌ళాకారుల‌లో పోటీత‌త్వాన్ని పెంపొందిస్తూ వారి ఉత్సాహ‌భ‌రిత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో నిపుణ‌త ప్ర‌ద‌ర్శించిన క‌ళాకారుల‌కు రూ.ల‌క్ష‌కు పైబ‌డిన బ‌హుమ‌తుల‌ను అందిస్తున్నామ‌న్నారు. తొలిసారి గుజ‌రాతీ ప‌డ‌తులు నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి న‌గ‌ర వాసులు స‌హ‌క‌రిస్తార‌ని భావిస్తున్నామ‌న్నామ‌ని నిర్వాహ‌కులు సుమ‌న్, నీహా తెలిపారు.