గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:09 IST)

శరన్నవరాత్రులు- నైవేద్యాలు

శరన్నవరాత్రులను దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటారు. దసరా పండుగ కోసం పది రోజుల పాటు విభిన్న రూపాల్లో దుర్గాదేవికి పూజ చేస్తారు. ముగ్గురమ్మలను పూజించే ఈ నవరాత్రుల్లో కనక దుర్గకు రోజుకో నైవేద్యాన్ని స

శరన్నవరాత్రులను దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటారు. దసరా పండుగ కోసం పది రోజుల పాటు విభిన్న రూపాల్లో దుర్గాదేవికి పూజ చేస్తారు. ముగ్గురమ్మలను పూజించే ఈ నవరాత్రుల్లో కనక దుర్గకు రోజుకో నైవేద్యాన్ని సమర్పించాలి. తొమ్మిది రోజుల పాటు ఇంటికొచ్చి వెళ్లే సుమంగళీ మహిళలకు వాయనం ఇవ్వాలి.
 
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని.. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అలా నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజున శైలపుత్రీ దేవిని పూజించాలి. ఆ రోజున అమ్మవారికి హల్వాపూరీ, సజ్జ అప్పాలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం, బియ్యం రవ్వతో చేసిన పాయసం సమర్పించాలి. 
 
రెండో రోజున పరమాన్నం, బియ్యం రవ్వతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. మూడో రోజున అల్లపు గారెలు, అల్లంతో మినప గారెలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయి. నాలుగో రోజున దద్దోజనం, కట్టెపొంగలి, ఐదో రోజున కొబ్బరి అన్నం, పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఆరో రోజున పూర్ణాలు, బూరెలు, రవ్వతో కేసరి, చక్కెర పొంగలి సమర్పించాలి. 
 
ఏడో రోజున పాయసం, శెనగలు, అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఎనిమిదో రోజు సాంబార్ రైస్ నైవేద్యంగా సమర్పిస్తే సకలసంపదలు చేకూరుతాయి. తొమ్మిదో రోజున పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పదో రోజున (విజయ దశమి) చలిమిడి, పానకం, వడపప్పు, పులిహోర, పాయసం, గారెలు, ముద్దపప్పును సమర్పించుకోవడం ద్వారా దుర్గామాత అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు సలహా ఇస్తున్నారు.