శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (15:13 IST)

మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహం.. ఎక్కడ?

విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన ఓ ముఠా ఈ హత్యకు పాల్పడింది. మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహంతో ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన నీలమేఘ అమరన్‌గా గుర్తించారు. మృతుడి ఆధార్ కార్డు ప్రకారం అతడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి ముఠానే ఈ దురాగతానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
హత్య తర్వాత కారులో పరారైన దుండగులను వెంటాడిన పోలీసులు యలమంచిలి ప్రాంతంలో ఐదుగురిని పట్టుకున్నారు. వారివద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసెం గాలిస్తున్నారు.