శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (15:47 IST)

భార్య సహకారంతో పనిమనిషిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. చివరకు ఏమైంది?

హైదరాబాద్ నగరంలో పదమూడేళ్ల క్రితం పనిమనిషిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి కోర్టు తాజాగా తీర్పు వెలువరిచింది. పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన 53 ఏళ్ల యజమానికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే అతనికి సహకరించిన భార్యకు జరిమానా విధించింది. గుంటూరు జిల్లా నల్లచెరువు ఏరియాకు చెందిన ఓ 21 ఏళ్ల యువతి పొట్ట కూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. 
 
బంజారాహిల్స్ ఏరియాలోని మిథాలినగర్‌లో ఉండే 53 ఏళ్ల వహీద్ ఖాన్ నివాసంలో పని మనిషిగా చేరింది. వారి ఇంట్లోనే ఉంటూ తోట పని, ఇంటిపని వంటి పనులన్నీ చేస్తూ ఉండేంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న యువతిపై వహీద్ ఖాన్ కన్నేసాడు.. ఇంట్లో చాలా చోట్ల రహస్య కెమెరాలు ఏర్పాటు చేసాడు. భర్త పనిమనిషిపై కన్నేసాడని తెలుసుకున్న భార్య అతడిని మందలించకుండా, భర్తకు సహకరించింది. 
 
భార్య సహకారంతో వహీద్ బాత్రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, పనిమనిషి స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసాడు. ప్రతిరోజూ రాత్రి ఆ వీడియోలను చూస్తూ రాక్షసానందం పొందేవాడు.
 
కొన్నిరోజుల తర్వాత కడుపునొప్పిగా ఉందని సదరు యువతి యజమానురాలికి చెప్పింది. దానికి తన దగ్గర మాత్రలు ఉండాయని చెప్పి, వాటిని మింగమని ఇచ్చింది. వాటిని వేసుకుని నిద్రించిన యువతి, నిద్రలేచేసరికి నగ్నంగా మంచంపై పడి ఉంది. తనకు ఏమి అయ్యిందంటూ ఆమె ప్రశ్నించగా, నిద్రలో బట్టలు లేకుండా పడుకున్నావంటూ సమాధానమిచ్చింది.
 
అది అలా ఉంటే మరుసటి రోజు కూడా వహీద్‌ఖాన్ భార్య ఇచ్చిన టీ తాగిన తర్వాత మళ్లీ ఇలాగే జరగడంతో పనిమనిషికి అనుమానం వచ్చి వహీద్‌ఖాన్‌ను, అతని భార్యను నిలదీసింది. దీంతో వహీద్‌ఖాన్ ఆవేశంగా భార్య సహకారంతో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
 
ఇంటి నుండి పారిపోయిన ఆమె 2006 జూన్‌లో తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఈ కేసును 13 ఏళ్ల పాటు విచారించి, మంగళవారం నాడు తీర్పు వెలువరించింది. వహీద్‌ఖాన్‌కు 10 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే అత్యాచారానికి సహకరించిన భార్యకు రూ.10 వేల జరిమానా విధించింది.