సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 27 మార్చి 2019 (14:33 IST)

ఇలా చేస్తే వయగ్రా కూడా అవసరం లేదట...!

శృంగారమనేది జీవితంలో ఒక భాగమనేది అందరూ చెప్పిన మాటే. అయితే ఈ స్పీడు యుగంలో ఆఫీసులో టెన్షన్లు, ఒత్తిళ్ళ మధ్య పనిచేస్తుంటే శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. నిద్ర లేచిన మొదలు పడుకునే దాకా సరిపోతుంది. నిరంతర పోటీ జీవితంతో టెన్షన్లు చాలామందిలో శృంగార కోరికలు తగ్గిపోతున్నాయి. చాలామంది భార్యాభర్తల్లో శృంగారంపైన ఇంట్రస్ట్ తగ్గిపోతోందట. ముఖ్యంగా మగవారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. 
 
బాదంపప్పు నుంచి మునక్కాయల వరకు తమ శృంగార సామర్ధ్యాన్ని పెంచుతాయని భావిస్తూ తింటుంటారు. అయితే మగవారిలో కొత్త ఆశలు చిగురింపజేసేలా ప్రయోగాలు సక్సెస్ అయ్యాయట. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై మక్కువ పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలిందట. 
 
కొందరికి ఆరువారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా 82 శాతం మందిలో శృంగార ఆసక్తి గణనీయంగా పెరిగిందట. అంతేకాకుండా 63 శాతం మందిలో శృంగార సామర్థ్యం పెరగడం గమనార్హం. మెంతుల్లో శాంపోనిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయట. టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లను ఇది ప్రేరేపిస్తుందట. అందువల్ల మెంతులు శృంగార సామర్థ్యంపై ప్రభావితం చేస్తుందనేది పరిశోధకుల భావన.