బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 31 జనవరి 2019 (22:12 IST)

పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరగాలంటే... ఇదే మార్గం...

ఇటివలి కాలంలో దంపతులలో శృంగారపరమైన సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందులు ఉన్నప్పటికి వాటిని వాడడం వలన ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అలాకాకుండా ప్రకృతిలో సహజసిద్దంగా లభించే కొన్ని పదార్థాలతో ఆ శక్తిని పెంచుకోవచ్చు. అంతేకాకుండా శృంగారం ఆనందాన్ని, సంతృప్తినే కాదు అనేక రకములైన అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడేస్తుందనీ కొన్ని అధ్యయనాల్లో తేలింది. అవేంటో చూద్దాం.
 
1. శృంగార సామర్థ్యం పెంచుకోడానికి బీట్రూట్‌ను తినాలి. దీనిలో వుండే ట్రిప్టోఫాన్ వల్ల సామర్థ్యం పెరుగుతుంది.
 
2. పురుషుల్లో కాస్త వయసు అయ్యాక టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది. అయితే బ్రోకలీ శరీరంలో టెస్టోస్టెరోన్‌ను పెంచేందుకు బాగా సహకరిస్తుంది. పురుషుల్లో హార్మోన్లను పెంచే గుణం బ్రోకలీకి ఉంటుంది. రోజూ దీన్ని తింటూ ఉంటే శృంగారపరమైన శక్తిని సహజంగా పొందుతారు.
 
3. దానిమ్మ శృంగార శక్తిని బాగా పెంచుతుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ తింటే రాత్రంతా శృంగారంలో  బాగా ఎంజాయ్ చేయొచ్చు.
 
4. గుమ్మడికాయ గింజలు శృంగారపరమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. వీటిల్లో జింక్, ఒమేగా -3 కొవ్వు యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లైంగిక హార్మోన్-స్థాయిలను పెంచుతాయి. 
 
5. శృంగారంలో రెగ్యులర్‌గా పాల్గొంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇలా పాల్గొనడం వల్ల యాంటీబాడీ ఇమ్యునోగ్లోబులిన్ పెరుగుతుంది. దీంతో సాధారణ జలుబు, జ్వరం వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండగలుగుతారు.
 
6. శృంగారంలో తరుచూ పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. రెగ్యులర్‌గా పాల్గొనేవారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారని పరిశోధనల్లో తేలింది.
 
7. శృంగారంలో పాల్గొంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. సాధారణ సమయంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఇది విడుదల కావడం వల్ల ఏమయినా నొప్పులు వెంటనే తగ్గుతాయి.