ఆహారంతో చర్మ సౌందర్యం.. ఎలా..?
పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వలన శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది. విటమిన్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. అందువలన ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం అవసరం.
ఆరోగ్యం కోసమని కేవలం పాలు మాత్రమే తాగితే కొవ్వు పదార్థాలు పెరిగి విపరీతంగా బరువు పెరుగుతారు. చర్మం ముడతలు పడకుండా విటమిన్ ఎ అడ్డుకుంటుంది. అందువలన అవసరమైనన్ని పాలే తాగిలి. పప్పు ధాన్యాలు, పచ్చని కూరలు, అరటిపండ్లలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఉంటుంది. చర్మం మొద్దు బారకుండా ఈ విటమిన్ కాపాడుతుంది.
చర్మం అడుగు పొరలలోని జీవకణాలను బలంగా ఉంచడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. బత్తాయి, మామిడి, టమోటా పళ్ళు, ఆకుకూరల్లో ఈ విటమిన్స్ లభిస్తాయి. రక్తంలో లోహాల శాతం కూడా చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన క్రీములే అందాన్ని పెంచుతాయనుకోవడం భ్రమ. ఎక్కువసార్లు ముఖం కడిగేవారు ప్రతిసారీ సబ్బు వాడకుండా కేవలం నీళ్ళతో మాత్రమే కడుక్కోవాలి. చన్నీటిస్నానం, రిలాక్స్‌గా ఉండడం కొద్ది వరకు చర్మానికి మంచిది.