నా ప్రేయసి మరొకర్ని పెళ్లి చేసుకుంది.... కానీ ఇప్పుడు మళ్లీ రమ్మంటోంది...

couple
Last Modified సోమవారం, 28 జనవరి 2019 (13:26 IST)
ఆమెను నేను ఎంతగానో ప్రేమించాను. ఆమె నా జీవత భాగస్వామి కాకపోతే చచ్చిపోయేంత ప్రేమ. కానీ అనుకోకుండా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆమె వేరొకరిని పెళ్లాడింది. ఇందుకుగాను నన్ను ఒప్పించింది. తనను మరిచిపొమ్మని బతిమాలింది. ఐనా నేను షాక్ నుంచి తేరుకోలేకపోయాను. తను లేకపోతే చచ్చిపోతానని అన్నాను. దాంతో ఓ రోజు నావద్దకు వచ్చి శృంగార సుఖాన్ని కూడా అందించి ఇక తనను అంతటితో మర్చిపొమ్మంది. ఆమె నా గురించి అంతగా బతిమాలేసరికి కెరీర్ పైన దృష్టి సారించి మంచి ఉద్యోగం సాధించాను.

ఆమెకు పెళ్లయి 4 సంవత్సరాలైంది. ఇన్నేళ్ల కాలంలో మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఈమధ్య ఓసారి ఆమే ఫోన్ చేసింది. తన జీవితం ఏమీ బాగా లేదనీ, తన భర్త వట్టి తాగుబోతు అనీ, అతడికి వుండాల్సిన దురలవాట్లన్నీ వున్నాయనీ, తనకు జీవితం విరక్తిగా ఉందనీ, నన్ను కలవాలని ఉన్నదని కోరింది. వెంటనే నన్ను రమ్మనమని బోరున ఏడ్చేసింది.

ఆరోజు నేను ఎంతగానో బాధపడ్డాను. కానీ ఆమె ఇంటికి వెళ్లే సాహసం చేయలేదు. వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న భయం వెంటాడుతోంది. ఇదంతా ఇలావుంటే ఆమె ఇప్పుడు నన్నెందుకు రమ్మంటోందో అర్థం కావడంలేదు. మళ్లీ శృంగారం కావాలని అడుగుతుందా...? అలా అడిగితే నేనేం చేయాలి...?

నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె పిలుస్తోంది. దీనికి కారణం ఆమెకు మీతో ఉన్న పాత పరిచయమే. తన కుటుంబంలో తలెత్తిన సమస్యలతో సతమతమవుతున్న ఆమె మీ నుంచి ఓదార్పును కోరుతోంది అనుకోవచ్చు. ఐతే ఆమె మళ్లీ శృంగారం చేయమంటుందేమో అనేది మీ అనుమానమే. కానీ, ఆమె అలాంటి కోరికను వెలిబుచ్చకపోవచ్చు. కనుక ఆమెను సమస్యల నుంచి బయటపడేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇవ్వడం చేయవచ్చు. ఒకవేళ శృంగార ప్రస్తావన వస్తే దాటవేయడం మంచిది.దీనిపై మరింత చదవండి :