సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (13:22 IST)

ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టాలంటే..?

ఆస్తమా వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధి వయసు తేడా లేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే.. బరువు ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య అధికంగా వేధిస్తుంది. ఇప్పటి చలికాలంలో ఈ ఆస్తమా వ్యాధి రావడం సహజమే. ఈ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం....
 
ఆస్తమా వ్యాధిగలవారు ప్రతిరోజూ వేన్నీళ్లు తాగిలి. తీపి పదార్థాలు తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే.. ఆస్తమాకి తీపి అంటే చాలా ఇష్టమట. మీరు సాధారణంగా తీపి పదార్థాలు తీసుకోకపోయినా.. ఈ వ్యాధి వచ్చినప్పుడు స్వీట్స్ తింటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకని మీరు వెంటనే స్వీట్స్ తినడం ప్రారంభించకండి.. ఒకవేళ తీసుకుంటే.. శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతో పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక వీలైనంత వరకు స్వీట్స్ తీసుకోవడం మానేస్తే మంచిది.
 
ఇక బరువు అధికంగా ఉన్నవారు.. ఓ 5 నిమిషాలు నడిస్తే చాలు.. వారిని ఆస్తమా విపరీతంగా బాధిస్తుంది. దీని కారణంగా శరీరమంతా ఒత్తిడి, అలసట, నీరసంగా ఉంటుంది. దాంతో సరిగ్గా నిద్రకూడా రాదు. ఇంకా చెప్పాలంటే.. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటి నుండి విముక్తి పొందాలంటే.. బరువు తగ్గించడమే మొదటి పద్ధతి. బరువును తగ్గించాలంటే.. ప్రతిరోజూ గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కనుక తప్పక రోజుకో గ్లాస్ నిమ్మరసం తాగండి.. బరువు తగ్గండి.