మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:10 IST)

ఎస్సైగా వుండి.. అక్రమ సంబంధం.. అడిగితే భార్యను, అత్తను చితకబాదాడు..

ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ పనేంటని అడిగిన భార్యను, అత్తను ఆ ఎస్సై చితకబాదాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎస్సై ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మణ

ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ పనేంటని అడిగిన భార్యను, అత్తను ఆ ఎస్సై చితకబాదాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎస్సై ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మణుగూరు పట్టంణంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జితేందర్‌ను అక్రమ సంబంధం గురించి ప్రశ్నించినందుకు భార్యతో పాటు అత్తను కూడా అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో అత్త, భార్య తీవ్రంగా గాయపడ్డారు. 
 
మణుగూరు ఎస్‌ఐ జితేందర్‌ కొత్తగూడెంకు చెందిన ఎస్‌కే పర్వీన్‌ను 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. కులాలు వేరైనప్పటికి ఇద్దరు ప్రేమించుకోవడంతో పెద్దలు కూడా వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. అయితే గత కొంత కాలంగా జితేందర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతడు గంటల తరబడి వేరే మహిళతో చాటింగ్, ఫోన్‌లో మాట్లాడటం చేస్తుండటాన్ని భార్య పర్వీన్ గుర్తించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పర్వీన్ తన అమ్మవారింటికి వెళ్ళిపోయింది.
 
అయితే అలా వెళ్లి పది నెలలు కావస్తున్నా జితేందర్ భార్యను పట్టించుకోలేదు. దీంతో పర్వీన్ తన తల్లిని, మహిళా సంఘాల ప్రతినిధులను తీసుకుని అతడు నివసిస్తున్న ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన జితేందర్‌ భార్యతో పాటు అత్తను కూడా చితకబాదాడు. వారిని రక్తం వచ్చేలా కొట్టి అక్కడినుండి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.