ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 14 నవంబరు 2016 (18:23 IST)

సంధ్యారాణి ఆత్మహత్య... ప్రొఫెసర్ లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు ఒక పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన గుంటూరు ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలో ఆమెను ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌ ప్

గుంటూరు ఒక పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన గుంటూరు ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలో ఆమెను ప్రత్యేక పోలీసులు అరెస్టు చేశారు. గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌ ప్రొఫెసర్‌ లక్ష్మిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 
 
21 రోజులుగా ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా జూడాలు, వైద్య సిబ్బంది ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఎట్టకేలకు గుంటూరు స్పెషల్ పోలీసులు ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేశారు. తన ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని సంధ్యారాణి సూసైడ్ నోట్ రాయగా, ఈ ఘటనపై ఏర్పాటు అయిన కమిటీ కూడా లక్ష్మి వేధింపుల వల్లే  సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. 
 
కాగా లక్ష్మి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీనితో అండర్‌ గ్రౌండ్ లోకి వెళ్లిన ప్రొఫెసర్ లక్ష్మిని చివరికి పోలీసులు అరెస్టు చేశారు.