శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:06 IST)

టిక్కెట్ కొనకుండా కొండపైకి వెళ్ళిన బాలకృష్ణ.. ప్రోటోకాల్ ఉల్లంఘన

సాధారణంగా రాజకీయ పార్టీ నేతలు నిబంధనలు తుంగలో తొక్కడం జరుగుతుంటాయి. కానీ తన చిత్రాల ద్వారా సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చే సినీ నటులు... నిజజీవితంలో మాత్రం అవేం పట్టించుకోరు. ఇందుకు సినీ నటుడు బాలకృష్ణ ప

సాధారణంగా రాజకీయ పార్టీ నేతలు నిబంధనలు తుంగలో తొక్కడం జరుగుతుంటాయి. కానీ తన చిత్రాల ద్వారా సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చే సినీ నటులు... నిజజీవితంలో మాత్రం అవేం పట్టించుకోరు. ఇందుకు సినీ నటుడు బాలకృష్ణ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 
 
తాజాగా కృష్ణా పుష్కరాల కోసం విజయవాడకు వచ్చిన ఆయన.. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. దుర్గగుడి మీదకు వెళ్లడానికి టికెట్ కొనాల్సి ఉన్నా కొనకుండా.. సొంత వాహనాలతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసి ఆయన కొండ మీదకు వెళ్లిపోయారు. ఇలా ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, దుర్గగుడి అధికారులు మాత్రం మిన్నకుండి పోయారు.