శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (10:12 IST)

నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్..

ప్రజల్లోనే కాకుండా ప్రజా ప్రతినిధుల్లో కూడా కరోనా టెన్షన్ పెరిగిపోతుంది. రాజకీయ నేతలు కూడా ప్రస్తుతం కరోనా బారిన పడుతున్నారు. ఇంకా భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజగా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు. తిరుపతిలోని స్విమ్స్ ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడం.. ఆమె ఇటీవల మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో.. వైసీపీ కార్యకర్తలు ఆందోళన నెలకొంది. కానీ తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కరోనా బారిన పడిన తన గన్‌మెన్ సెలవుల్లో వున్నాడని రోజా చెప్పారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.