ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (17:25 IST)

శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్.. నారా లోకేష్ ఫైర్

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ సమావేశాల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. కల్తీసారా  మరణాలపై శాసనమండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని విమర్శించారు. 
 
శవరాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆయన ఆరోపించారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. మనకు తెలిసి చనిపోయింది 25మందే.. తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలన్నారు. 
 
మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా..? అని నారా లోకేష్  వ్యాఖ్యానించారు. జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకన్న మరణాలపై పోస్ట్‌ మార్టం రిపోర్టు రాకముందే మంత్రులే సహజ మరణాలని తేల్చడమేంటని ఆయన మండిపడ్డారు.