శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (20:28 IST)

లోకేష్‌కు మంత్రి పదవి కన్ఫర్మ్... సన్నాహాల్లో చంద్రబాబు...

నారా లోకేష్ బాబును ఏపీ మంత్రిని చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం కూడా సిద్ధం అవ్వడంతో లోకేష్ బాబుకు మంత్రి పదవిని చేపట్టే అవకాశం ముంచుకొస్తోంది. ఆయనకు తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి సీటును కేటాయిస్తార

నారా లోకేష్ బాబును ఏపీ మంత్రిని చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం కూడా సిద్ధం అవ్వడంతో లోకేష్ బాబుకు మంత్రి పదవిని చేపట్టే అవకాశం ముంచుకొస్తోంది. ఆయనకు తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి సీటును కేటాయిస్తారని సమాచారం. 
 
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇక్కడ నుంచి బొడ్డు భాస్కర రామారావు ఉన్నారు. ఈయన స్థానం ఖాళీ అవుతుంది. ఐతే తనకు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని రామారావు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ లోకేష్ బాబుకు ఈ సీటు కన్ఫర్మ్ చేయడంతో ఇక ఆ స్థానంపైన జిల్లాలో ఆశావహులు ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. మరోవైపు లోకేష్ ఈ నెల 28న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 17న జరుగనున్నాయి.