శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 మే 2020 (20:45 IST)

నెల్లూరు నగరంలో 3 రోజుల పాటు నాట్స్ ఆహార పంపణీ

నెల్లూరు: తెలుగునాట ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేదలకు సాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన కూలీలకు అండగా నిలిచేందుకు వారి ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు సాయం అందిస్తోంది. తాజాగా నెల్లూరు నగరంలోని పేదలకు నాట్స్ ఆహార పంపిణీ చేసింది. 
 
నాట్స్ సభ్యులు ఎం.శ్రీనివాస్, ఎ. శ్రీధర్ చొరవతో నెల్లూరులోన మినీ బైపాస్ సాయిబాబా గుడి దగ్గర ఈ ఆహార పంపిణీ జరిగింది. స్థానికంగా ఉండే వినయ్ కుమార్ అతని మిత్రబృందం నాట్స్ సాయాన్ని పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు పేదలకు నాట్స్ సాయంతో ఇక్కడ ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు. 
 
నెల్లూరు నగరంలో పేదలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నాట్స్ సభ్యులు, నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ మంచికలపూడి శ్రీనివాస్‌లు దృష్టికి తీసుకురావడంతో వెంటనే వారు స్పందించి  పేదలకు కావాల్సిన ఆహార పంపిణీకి కావాల్సిన సహాయసహకారాలు అందించారు. అర్థాకలితో ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో నాట్స్ ఆహారపంపిణీ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేదలు హర్షం వ్యక్తం చేశారు.