1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (10:36 IST)

పిల్లలకు ఈ వేసవిలో ఏమేమి తినిపిస్తున్నారు?

వేసవి వచ్చేసింది. మరోవైపు కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ నేపధ్యంలో మనం తీసుకోవల్సిన ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
 
తాటి ముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పిటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
 
గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్‌కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి. ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.