గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:34 IST)

ఫేస్ క్రీమ్ కొనేందుకు మెడికల్ షాపుకు వెళ్తే... బాలిక వద్ద అసభ్యంగా ప్రవర్తించి?

మెడికల్ షాపుకు వెళ్లిన బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలి మేనమామ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాదులోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

మెడికల్ షాపుకు వెళ్లిన బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలి మేనమామ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాదులోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కుమార్తె (12)ను ఇంటి యజమాని ఫేస్ క్రీమ్‌కు తీసుకురమ్మని మెడికల్ షాపునకు పంపింది. 
 
బాలిక వెళ్లిన మెడికల్ షాపులో ఈసీఐఎల్‌లో నివసిస్తూ అనంతపురానికి చెందిన రామలింగేశ్వర్‌రెడ్డి(22) పనిచేస్తున్నాడు. ఫేస్ క్రీమ్ తీసుకునేందుకు వచ్చిన బాలికపై రామలింగేశ్వర్ రెడ్డి కన్నుపడింది. బాలికకు ఫేస్‌క్రీమ్‌ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే బాలిక అతని నుంచి తప్పించుకుని ఇంటికెళ్లి ఈ విషయం చెప్పింది. దీంతో రామలింగేశ్వర్ రెడ్డిపై బాలిక మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.