సినిమా టిక్కెట్లపైనా ప్రభుత్వ అజమాయిషీ... బుకింగ్ వెబ్ సైట్ !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అమ్మకాలపైనా అజమాయిషీ చేయాలని సంకల్పించింది. సినీ రంగంలో కీలక పాత్ర వహిస్తున్న థియోటర్ల గుత్తాధిపత్యానికి తెరదించాలని సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.
సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. సినిమా థియేటర్స్‌లో టికెట్స్ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.