శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:07 IST)

నిజామాబాద్ యువతి అత్యాచార కేసులో ముగ్గురి అరెస్టు

జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణంలో ఓ ఆస్పత్రి గదిలో ఓ యువతికి మద్యంతాపించి అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులను అరెస్టు చేశారు. 
 
బాధిత యువతిపై ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులు అత్యాచారం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాధితురాలికి సదరు యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 
 
బర్త్‌డే పార్టీ కోసం ఆర్మూర్‌ నుంచి యువతి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితులపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు.