శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (13:39 IST)

వినాయక నిమజ్జనంలో విషాదం - నీట మునిగి యువకుడి మృతి

నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. ఈ నిమజ్జమనంలో ఓ యువకుడు మృతి చెందారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం సందర్భంగా వాగులో దిగిన ఓ యువకుడు నీళ్లలో మునిగి మృత్యువాత పడ్డాడు. 
 
ఈ విషాదకర సంఘటన బోధన్ మండలం నాగంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దయానంద్ అనే వ్యక్తి నిమజ్జనం కోసం వాగులో దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
 
శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మృతదేహం కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా..ఆదివారం ఉదయం బయటపడింది. దయానంద్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.