సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (13:07 IST)

పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీ : అధికారంలోకి వస్తే రూ.10 లక్షల బీమా

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు అధికార, విక్ష పార్టీలపై మాటల తూటాలు పేల్చుతున్నారు. మరోవైపు తాను అధికారంలోకి ఏం చేస్తానో స్పష్టంగా చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పౌరుడుకీ రూ.10 లక్షల వైద్య ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, సుస్తి చేస్తే మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి పట్టంకడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ.. యేడాదికి రూ.10 లక్షల రూపాయల వైద్య బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఆయుష్మాన్ భవ పథకం కింద యేడాదికి ప్రతి కుటుంబానికి రూ.5లక్షల ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్‌ను ఇప్పటికే ప్రకటించింది. ఐతే జనసేన వ్యక్తిగతంగా రూ.10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది.