జగన్‌ను మరొక సందర్భంలో కలుస్తాను, ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేను: పవన్ కళ్యాణ్
మరికొద్ది గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవం జరుగబోతుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించారు జగన్. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఫోన్‌లో ఆహ్వానించారు.
అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతుండగా, చంద్రబాబు నాయడు హాజరవుతారా లేక తన ప్రతినిధిగా పార్టీ సీనియర్ నేతను పంపించే అవకాశం ఉంటుందా అనే అంశం ఆసక్తిగా మారింది. చిరంజీవి హాజరు కావడంపై ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం లేకపోయినా జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటున్నారు. మరొక సందర్భంలో కలుస్తానని జగన్ మోహన్ రెడ్డికి చెప్పినట్టు కీలక సమాచారం.