గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 28 మే 2019 (22:19 IST)

తిరుమలకు వచ్చేయండి... నే చూసుకుంటా: రమణదీక్షితులతో జగన్

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా చేసిన రమణ దీక్షితుల వివాదం అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు.
 
అక్కడ ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. వారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా వున్నారు. దీక్షితులతో మాట్లాడిన జగన్... రేపు ఆలయంలో కలుద్దామని చెప్పారు. దీనితో తనని ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పారాయన. అది విన్న జగన్ మోహన్ రెడ్డి అదంతా తాను చూసుకుంటాను అని భరోసా ఇచ్చి పంపారు. దీన్నిబట్టి రమణదీక్షితులకి లైన్ క్లియర్ అయినట్లేనని అనుకుంటున్నారు.