శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (20:44 IST)

బీజేపీ కోసం పవన్ తిరుపతి పాదయాత్ర.. ఎప్పుడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తిరుపతిలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా  ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మార్ పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ పాదయాత్ర చేస్తున్నారని వెల్లడించారు. 3వతేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. బీజేపీ-జనసేన ముఖ్య నాయకులు ఈ పాదయాత్ర‌లో నాదెంద్ల తెలిపారు. పాదయాత్ర తర్వాత పవన్‌ బహిరంగ సభలో మాట్లాడతారని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పవన్‌ రెండో విడత పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంటుందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.