ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (10:49 IST)

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ- జగన్ కోసమేనా?

pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 25 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. 
 
పవన్ కళ్యాణ్, అమిత్ షా మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ముఖ్యంగా తెలుగు మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న ధర్మాబాద్ ప్రాంతంలో బీజేపీ కూటమి అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని అమిత్ షా ప్రతిపాదించినట్లు వర్గాలు వెల్లడించాయి. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్‌ను పాల్గొనాలని బీజేపీ అధిష్టానం గతంలోనే ఆలోచించడం గమనార్హం.సరస్వతీ పవర్ భూములను ఆలంబనగా చేసుకుని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

వారి కుటుంబ తగాదాగా ఈ వివాదం బయటకు వచ్చిన రోజునే పవన్ కల్యాణ్ అప్రమత్తమై సరస్వతీ పవర్‌కు చెందిన వాటిలో ప్రభుత్ భూములు ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు.