ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2024 (20:35 IST)

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

mandha krishna madiga
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రి అనితను ఉద్దేశించి చిన్నపిల్లవాడి లెక్క మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ. హోంమంత్రి అనితను ఉద్దేశించి అంటే దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందినవారిని అన్నట్లే అని అన్నారు. ఐనా ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల శాఖలకు సంబంధించి ఏమైనా వుంటే కేబినెట్ మంత్రుల సమావేశంలో మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా చిన్నపిల్లవాడిలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.
 
హోంశాఖ అంటే ఎవరు, ప్రభుత్వం కాదా... ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామ్యం కాదా.. కనుక ఇలాంటి వ్యాఖ్యలు మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుకోవాలంటూ చెప్పారు. ఐనా ఎన్నికల సమయంలోనే పవన్ కల్యాణ్ జనసేన గురించి తాము అసంతృప్తి వ్యక్తం చేసామనీ, మా సామాజిక వర్గానికి ఆయన ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు.