పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్‌లోనే నిందితుడి ఆత్మహత్య
పోలీసు స్టేషన్‌లోనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్‌లో వన్యప్రాణుల వేట కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న శ్రీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న బాత్ రూమ్‌లో ఉరివేసుకొని శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
వన్యప్రాణుల వేట కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన నలుగురు వేటగాళ్లలో శీలం రంగయ్య కూడా నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. మృతుడి స్వస్థలం రామగిరి మండలం రామయ్య పల్లి గ్రామమని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.