బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:52 IST)

ఢిల్లీలో విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారు : ఆర్ఆర్ఆర్

raghuramakrishnam raju
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ప్రతి ఒక్కరూ బ్రోకర్ రెడ్డి అంటూ పిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ, సీఎం జగన్ గత నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిశారన్నారు. అయితే, ఆయన ఎందుకు కలిశారో జగన్‌కే క్లారిటీ లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశానికి సంబధించి ముఖ్యమంత్రి జగన్‌ను మందలించడానేకి ప్రధాని మోడీ ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం హస్తినలో జరుగుతుందన్నారు. 
 
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‍లో ఎలాంటి అవకతవకలు లేవంటూ పార్టీకి సంబంధించిన పత్రికలో తప్పుడు కథనాలు రాశారని ఆయన రఘురామ ఆరోపించారు. అదేసమయంలో ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.