సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:55 IST)

కొడాలి నాని! నోరు అదుపులో పెట్టుకో: పిల్లి మాణిక్యరావు

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలతో.. ఏదో సాధించేసినట్లు వీర్రవీగుతున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్‌ని గౌరవించకుండా ముప్పుతిప్పలు పెట్టారని చెప్పారు.

పవిత్రమైన ఎన్నికలను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, దౌర్జన్యాలతో బలవంతంగా విత్ డ్రాలు చేయించి గెలవడం ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు.

నామినేషన్ పత్రాలు చించేసి, అభ్యర్థులను ఇబ్బందులు పెట్టి, మద్యం బాటిళ్లతో మభ్య పెట్టి గెలిచారని విమర్శించారు. అక్రమ దారుల్లో గెలిచి దాన్ని గెలుపనుకోవడం సిగ్గుగా లేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును కించపరుస్తూ మాట్లాడితే తాట, తోలు రెండూ వలుస్తామని హెచ్చరించారు.