గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2025 (10:17 IST)

సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేనలో కీలక పదవి!

bunny vasu - pawan
సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేన పార్టీలో కీలక పదవి లభించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ మహానాడు మార్చి నెల 14వ తేదీన జరుగనుంది. ఈ మేరకు ముహూర్తాన్ని ఖరారు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ మహానాడు కావడంతో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాత బన్సీ వాసుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించారు. బన్నీ వాసును ఆవిర్భావ మహానాడు పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
సభకు సంబంధించిన నిర్వహణ మొత్తం బన్నీ వాసు నేతృత్వంలో జరగనున్నట్టు తెలుస్తుంది. బన్నీ వాసు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పబ్లిసిటీ కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమా నిర్మాణంలో బన్నీ వాసు నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్వస వేడుక విజయవంతానికి ఉపయోంచనున్నారని జనసైనికులు భావిస్తున్నారు. ఈ కీలక నియామకంలో జనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.