మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (22:57 IST)

మంత్రి రోజాకు మద్దతిచ్చిన రమ్యకృష్ణ

ramyakrishna
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు సినీ నటీమణుల మద్దతు పెరుగుతోంది. మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా నటి రమ్యకృష్ణ స్పందించారు. నటి రమ్య, రోజా మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. 
 
మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
 
కాగా, రోజా, రమ్యకృష్ణ సినిమాల్లో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. ఇటీవలే రమ్య.. రోజా ఇంటికెళ్లి కలిసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.