సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2023 (12:41 IST)

రోజాపై బండారు వ్యాఖ్యలు రాజకీయాలకే అవమానం: రాధిక శరత్ కుమార్

radhika
ఏపీ మంత్రి రోజాపై తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఖండించారు. ఓ గౌరవనీయమైన పార్టీకి చెందిన నాయకుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తనను ఎంతో బాధించినట్లు ఆమె వెల్లడించారు. ఒకవైపు దేశం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారనీ, మహిళలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు వారి శక్తిని ఎంతమాత్రం సన్నగిల్లచేయలేవని అన్నారు. మంత్రి రోజాకి ఈ విషయంలో తన మద్దతు పూర్తిగా వుంటుందని ఆమె అన్నారు.
 
కాగా ఇప్పటికే రోజాకి సినీ నటి కుష్బూ, కవిత మద్దతుగా నిలిచారు. తెదేపా నాయకుడు బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపధ్యంలో సినీ నటి రాధికా శరత్ కుమార్, రోజాకి మద్దతును తెలుపుతూ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేసారు.