ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (13:08 IST)

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రూ.400 కోట్లు

భారత రిజర్వు బ్యాంకు పంపిన రూ.400 కోట్ల నోట్ల కట్టలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్

భారత రిజర్వు బ్యాంకు పంపిన రూ.400 కోట్ల నోట్ల కట్టలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌బిఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఎపీకి 2,500 కోట్లు మిగిలినది తెలంగాణకు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త జీతాలు పడినా బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బ్యాక్సుల్లో వచ్చిన డబ్బును భారీ భద్రత మధ్య తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. 19 బ్యాక్సులలో 400 కోట్ల రూపాయలను ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలోని బ్యాంకులకు తరలించారు. 
 
ఆర్‌బిఐ పంపిన నగదులో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవకాశం ఇక ఉండదని, ఆర్ బిఐ పంపిన నోట్లలో కొత్త 500రూపాయల నోట్లు కూడా ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.