శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 మే 2017 (14:29 IST)

మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు ప్రమాదానికి కారణమిదే!

ఏపీ పురపాలక శాఖామంత్రి నిషిత్ నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మరణించడానికి ప్రధాన కారణం ఏంటో తెలిసింది. ఇదే అంశంపై ఓ జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఏపీ పురపాలక శాఖామంత్రి నిషిత్ నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మరణించడానికి ప్రధాన కారణం ఏంటో తెలిసింది. ఇదే అంశంపై ఓ జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సాధారణంగా ఎస్‌యూవీ కార్లలో గంటకు 64 కిలోమీటర్ల వేగం కంటే వెళితే ప్రమాదాలకు గురయ్యే అవకాశముంది. కానీ, మంత్రి కొడుకు ప్రయాణించిన కారు ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో పిల్లర్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆ కథనంలో పేర్కొంది.  
 
వాస్తవానికి నిషిత్ నారాయణ ప్రయాణించిన కారు మెర్సెడ్స్ జీ63 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. ధర రూ.2 కోట్లుపైమాటే. ఈ వాహనంలో ప్రమాదం జరగకుండా, ఒకవేళ జరిగినా బయటపడటానికి అవసరమైన అన్ని సదుపాయులు ఉన్నాయి. ముఖ్యంగా డ్యుయల్ ఫ్రంట్, సైడ్ అండ్ విండో ఎయిర్ బ్యాగ్స్, పెల్విస్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఈఎస్‌పి(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం), అడాప్టివ్ బ్రేకింగ్ ఇలాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇన్నివున్నా నిషిత్ మాత్రం కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడలేక పోయాడు. 
 
దీనికి కారణం... కారు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం వల్లనే ఈ సేఫ్టీ టూల్స్ ఏవీ ఉపయోగపడలేదని పరిశీలకులు చెబుతున్నారు. నిషిత్ ప్రయాణించిన మోడల్ కారు 5.4 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. పైగా ఈ వాహనం టాప్ స్పీడ్ గంటకు 210 కిలోమీటర్లు. ప్రమాదం జరిగినపుడు నిషిత్ కారు స్పీడో మీటర్ ముల్లు 210 కిలోమీటర్ల వద్ద ఆగివుంది. సాధారణంగా గతంలో మోస్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ టెస్ట్ చేసిన పరిశోధనల్లో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. 
 
ఫాస్టెస్ట్ క్రాష్ టెస్ట్ ఇన్ ది వల్డ్ పేరుతో బ్రిటీష్ మోటరింగ్ టెలివిజన్ షో ఓ వీడియోను ప్రసారం చేసింది. ఫోర్డ్ ఫోకస్ ఫ్యామిలీ కారు గంటకు 193 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ప్రమాదానికి గురైనట్లు తేలింది. అంటే.. నిర్ణయించిన వేగానికంటే రెట్టింపు వేగంతో కారును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అందులో తేలింది.