ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 27 జనవరి 2017 (02:20 IST)

ఏం టైమింగ్ బాబూ తమరిది. హోదాను దేశభక్తితో కొట్టారే?

ప్రత్యేక హోదాపై అటు వైకాపా అధినేత జగన్, ఇటు పవన్ కల్యాణ్, ఇంకా రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు చేయాలని తలపెట్టిన మౌద దీక్షలను, కొవ్వొత్తుల ప్రదర్శనలను ఉక్కుపాదంతో అణిచేసిన తర్వాత విశాఖలో గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన చంద్

మావాళ్లు బ్రీఫ్డ్ మీ అన్నప్పుడు దేశభక్తి గురించి ఆయనకు గుర్తు రాలేదు. కానీ ప్రత్యేక హోదా గురించి  యావత్ రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో రోడ్లమీదికి వచ్చినప్పుడు మాత్రం ఉన్నట్లుండి దేశభక్తి ఆయన మనసులోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నాడు రాజకీయాలా... మనం మాట్లాడాల్సింది ఇప్పుడు దేశభక్తి గురించి కదా.. మధ్యలో ఈ ప్రత్యేక హోదా నినాదాలు ఏమిటి? అంటూ శివాలెత్తిపోయారు. ఆయనెవరో కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
 
ప్రత్యేక హోదాపై అటు వైకాపా అధినేత జగన్, ఇటు పవన్ కల్యాణ్, ఇంకా రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు చేయాలని తలపెట్టిన మౌద దీక్షలను, కొవ్వొత్తుల ప్రదర్శనలను ఉక్కుపాదంతో అణిచేసిన తర్వాత విశాఖలో గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన సమయంలో ప్రత్యేక హోదా కోసం నిరసనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. విశాKపట్నంలో భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్న ఈ సమయంలో విశాఖను తగులబెట్టడానికి అనుమతి ఇవ్వాలా అంటూ బాబు రెచ్చిపోయారు. 
 
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను నిరాకరించింది కాబట్టి ఏపీకి హోదాను ఇవ్వలేమని కేంద్రం పేర్కొన్న తర్వాతే తాను అన్నీ ఆలోచించి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడారు. పైగా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కావాలని కోరామని, దేశంలో ఈ ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రిని తానేనని బాబు పేర్కొన్నారు. రాజకీయాలతో రాష్ట్రాలకు వెలుగు నింపాలి కాని ఉద్యమాలతో, బంద్‌లతో కాదని హితవు చెప్పారు. 
 
కొత్త పెట్టుబడులతో 9 లక్షల ఉద్యోగాలొస్తాయి, రూ. 2.82 లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఇలాంటి సమయాల్లోనా నిరసనలు తెలిపేది అంటూ చంద్రబాబు విమర్శించారు. రాజకీయ పార్టీలు మీడియా పెట్టి బీచ్ రోడ్డులో కూర్చుని రౌడీయిజం చేస్తానంటే కుదరదనేశారు. శుక్రవారం కోర్టుకు హాజరయ్యే వ్యక్తులు హోదా గురించి మాట్లాడతారా అంటూ హేళన చేశారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో లక్షలాది ప్రజలు ప్రత్యేక హోదాకు మద్దతుగా నిలుస్తుంటే, టీడీపీ శ్రేణులు కూడా హోదా గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతుంటే ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి హోదా పేరెత్తితేనే పాపం, హోదా పేరెత్తే ప్రతి ఒక్కరూ పాపాత్ములే అనే ధోరణిలో ముందుకుపోతున్న బాబు ప్రజల మైండ్ సెట్ ఎలా మారుతోందో అర్థం చేసుకోలేకపోతున్నారా అనే అనుమానం ప్రబలుతోంది. ఆయన ఎంతగా దేశభక్తితో హోదా అనుకూల ప్రదర్శనలను అడ్డుకున్నా ఫలితం లేకపోయిందన్నది జనాభిప్రాయం.