శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (07:26 IST)

ఏపీలో మెడికల్ కాలేజీలకు నిధుల విడుదల

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మాణానికి రూ.2050 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 500 కోట్లు. కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 550 కోట్లు కేటాయించింది.

పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో ఒక్కొక్క చోట 100 ఎంబీబీఎస్ సీట్లు, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించనున్నాయి.

అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని మరియు పులివెందులలో కాలేజీలకు 104.17 కోట్ల రూపాయలతో  స్థలాల కొనుగోలుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.