గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:53 IST)

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

Reliance Foundation provides ₹20 crore aid for AP flood victims
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యులు పిఎంఎస్ ప్రసాద్; ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పివిఎల్ మాధవరావులు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ. 20 కోట్ల చెక్‌ను అందజేశారు.