బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:33 IST)

జగన్ హయాంలోనే లడ్డూ పాపం.. ముగ్గురిది నీచ రాజకీయాలు.. షర్మిల

YS Sharmila
YS Sharmila
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై ఆమె ఫైర్ అయ్యారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. 
 
అదీ జగన్ హయాంలోనే ఈ పాపం జరిగిందని షర్మిల చెప్పారు. తిరుమల డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందని... ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందేనని అన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాశానని షర్మిల తెలిపారు. లడ్డూ వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు తెలియాలని షర్మిల అన్నారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సీజేఐని కోరామని చెప్పారు. 
 
పనిలో పనిగా రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా అంటూ మిత్రకూటమిలోని ఏపీ సర్కారును ప్రశ్నించారు వైఎస్ షర్మిల. బాబు శాంతి హోమాలు చేస్తున్నారని, పవన్ దీక్షలు చేస్తున్నారని, జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఈ ముగ్గురూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

జగన్ సర్కార్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, కూటమి సర్కార్ లడ్డూలో మత రాజకీయాలు కలుపుతున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని, మోడీ డైరెక్షన్‌లో బాబు సర్కార్ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు.