మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (16:12 IST)

ఏపీలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, అనంత‌రం పెరేడ్‌ను ప‌రిశీలించిన గ‌వ‌ర్న‌ర్‌.
 
* హాజ‌రైన సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జె.కె.మహేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్ సవాంగ్. 
 
 
* గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న ప‌లువురు మంత్రులు, శాస‌న‌స‌భ్యులు
 

అమ‌రావ‌తి....
 
* 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసనసభ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శి రాజ్‌కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది.
 
* గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనమండలి భవనంపై జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కౌన్సిల్ ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్. కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు, ఇతర అధికారులు, సిబ్బంది.
 
సచివాలయం మొదటి భవనం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.
 
కార్యక్రమంలో పాల్గొన కార్యదర్శి శశిభూషణ్ కుమార్,చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ కెకె మూర్తి, సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి,సచివాలయ సిబ్బంది.
 
71వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఆవిష్క‌రించి మున్సిప‌ల్ స్కూల్స్‌లో చ‌దువుతున్న విద్యార్థుల నుంచి గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రిస్తున్న మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌. న‌గ‌ర‌పాల‌క సంస్థ జెండాను కూడా మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ఆవిష్క‌రించారు.